![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -45 లో.. జానూ, సూర్య, నందు, మురళి లాయర్ దగ్గరికి వెళ్తారు. మా నాన్న తరుపున ఉన్న ఒకే ఒక జ్ఞాపకం.. మా ఇల్లు.. దాన్ని వదులుకోము లాయర్ గారు.. ప్లీజ్ మాకు హెల్ప్ చెయ్యండి అని లాయర్ ని జానూ రిక్వెస్ట్ చేస్తుంది. మీరు బ్యాంకుకి లోన్ డబ్బు కడితే వేళం ఆపొచ్చని లాయర్ చెప్తాడు. మనకి డబ్బు సింహాద్రి అంకుల్ ఇస్తాడని నందు చెప్తుంది. దాంతో జానూ, సూర్య ఇద్దరు కలిసి సింహాద్రి ఇంటికి వెళ్తారు. ఆ విషయాలన్నీ సింహాద్రి మనిషి సింహాద్రికి ఫోన్ చేసి చెప్తాడు.
జానూ, సూర్య రావడం గమనించిన సింహాద్రి తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ.. కోటి రూపాయలు నష్టం తెస్తావా.. ఇప్పుడు నా ఫ్రెండ్ కుటుంబానికి ఎలా సాయం చెయ్యాలంటూ యాక్టింగ్ చేస్తాడు. అంకుల్ మీరు మాకు డబ్బు ఇస్తారా అని జానూ అడుగుతుంది. ఇప్పుడు ఒకతన్ని నమ్మితే.. కోటి రూపాయలు నష్టం వచ్చింది సారీ అమ్మ ఏం చెయ్యలేక పోతున్నానని శంకర్ ఫోటో దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతాడు. జానూ, సూర్య డిస్సపాయింట్ గా బయటకు వస్తారు. మా అమ్మని అడుగు ఇస్తుందని సూర్య అంటాడు. ఇద్దరు వాళ్ళ ఇంటికి బయల్దేరతారు. ఆ మాటలు సింహాద్రి విని సూర్య లాయర్ తో గొడవపడుతున్న వీడియోని భువనకి పంపిస్తాడు. చెల్లెమ్మ అల్లుడు చెయ్ జారిపోతున్నాడు వాడు ఆ జానూ మాయలో ఉన్నాడు. అందరు ఏమనుకుంటారని తనని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. ఆ తర్వాత జానూని తీసుకొని సూర్య వాళ్ళ ఇంటికి వస్తాడు. తుఫాన్ ని కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది.
తుఫాన్ అందరికి కప్ లో తీసుకొని వస్తాడు. మేమ్ తాగే కాస్ట్లీ వాటిలో జానూకీ ఇస్తావా అని తుఫాన్ పై భువన కోప్పడుతుంది. తర్వాత స్టీల్ గ్లాస్ లో జానూకి తీసుకొని వస్తాడు. దాంతో జానూ బాధపడుతుంది. తరువాయి భాగంలో మన ఇంటిని సొంతం చేసుకోవాలంటే అక్క నీకోసం నాన్న చేయించిన బంగారం అమ్మి డబ్బు తీసుకొని రావాలి.. అది నీ చేతుల్లోనే ఉందని నందుతో జానూ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |